logo

యుద్ధ నౌకలో గవర్నరు

నౌకాదళం దినోత్సవం సందర్భంగా గవర్నరు థావర్‌చంద్‌ గహ్లోత్‌ శనివారం యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను సందర్శించారు. ప్రస్తుతం దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఉదయం కార్వారకు సమీపంలోని ‘కదంబ’ నౌకా స్థావరాన్ని సందర్శించారు.

Published : 05 Dec 2021 01:44 IST


నౌకాదళ అధికారులతో కలిసి యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై గవర్నరు థావర్‌చంద్‌ గహ్లోత్‌ (మధ్యలో..)

కార్వార, న్యూస్‌టుడే : నౌకాదళం దినోత్సవం సందర్భంగా గవర్నరు థావర్‌చంద్‌ గహ్లోత్‌ శనివారం యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను సందర్శించారు. ప్రస్తుతం దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ జిల్లాల పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఉదయం కార్వారకు సమీపంలోని ‘కదంబ’ నౌకా స్థావరాన్ని సందర్శించారు. ఆయనకు నౌకాదళం అధికారులు సుశీల్‌ మీనన్‌, మహేశ్‌సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. యుద్ధనౌకను సందర్శించిన గవర్నరుకు అక్కడి ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. సీబర్డ్‌ రెండో దశ పనుల ప్రత్యేకతలు వెల్లడించారు. రెండు రోజులపాటు గవర్నరు ధర్మస్థల, ఉడుపి, కొల్లూరు, మురుడేశ్వర ప్రాంతాలను సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని