logo

నిందితుడిపై తూటా

మాదక ద్రవ్యాల విక్రయం, రౌడీమామూళ్లు వసూలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటరు రాహుల్‌ అలియాస్‌ స్టార్‌ రాహుల్‌పై హనుమంతనగర పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. కుడికాల్లోకి తూటా దిగడంతో గాయపడిన నిందితుడ్ని చికిత్స కోసం

Published : 18 Jan 2022 01:32 IST


ఆసుపత్రి పడకపై స్టార్‌ రాహుల్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : మాదక ద్రవ్యాల విక్రయం, రౌడీమామూళ్లు వసూలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటరు రాహుల్‌ అలియాస్‌ స్టార్‌ రాహుల్‌పై హనుమంతనగర పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. కుడికాల్లోకి తూటా దిగడంతో గాయపడిన నిందితుడ్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఆరోపణలపై నిందితునిపై 19 కేసులు దాఖలయ్యాయి. న్యాయస్థానం ముందు హాజరుకాని కేసుల్లో ఎనిమిదింటికి వారెంట్లు ఉన్నాయి. కోణనకుంటె సమీపంలోని నారాయణ నగరలో నిందితుడు ఉన్నట్లు గుర్తించి పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎస్సై బసవరాజ పాటిల్‌పై బాకుతో దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని లొంగిపోవాలని హెచ్చరించారు. ఎస్సై మాటల్ని పట్టించుకోకుండా పరారవుతుండగా.. ఒక రౌండు కాల్చి అరెస్టు చేశారని డీసీపీ హరీశ్‌ పాండే తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని