logo

తప్పిన నాలుగో అల ముప్పు?

కరోనా నాలుగో అల ప్రారంభమవుతుందని భయపడిన మేనెలలో వైరస్‌ తీవ్రత మందగనంలో సాగడం సామాన్యుడిని ఊపిరి తీసుకోనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం కేవలం 124 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 159 మంది పూర్తిగా కోలుకున్నారు.

Published : 20 May 2022 02:13 IST

బెంగళూరు (సదాశివనగర): కరోనా నాలుగో అల ప్రారంభమవుతుందని భయపడిన మేనెలలో వైరస్‌ తీవ్రత మందగనంలో సాగడం సామాన్యుడిని ఊపిరి తీసుకోనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం కేవలం 124 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో 159 మంది పూర్తిగా కోలుకున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య 1726కు చేరుకున్నాయి. పాజిటివిటీ 0.64 శాతంగా నమోదైంది. కెంపేగౌడ విమానాశ్రయంలో 4,086 మందికి, ఇతర ప్రాంతాల్లో 19,141 మందికి స్వాబ్‌ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,899 మంది టీకా వేయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని