logo

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

నేరాల నియంత్రణలో ప్రజల సహకారం పోలీస్‌ శాఖకు చాలా అవసరమని హరపన హళ్లి డీఎస్పీ హాలమూర్తిరావు పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ, హడగలి వర్తకుల సంఘాల ఆర్థిక సహాయంతో హడగలి పట్టణంలో ఏర్పాటు చేసిన నిఘా కెమేరాల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి హడగలిలో జరిగింది.

Published : 20 May 2022 02:13 IST

హడగలి పట్టణంలో నిఘా కెమేరాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న

ప్రముఖ వర్తకులు అశోక్‌, సత్యప్ప, డీఎస్పీ హాలమూర్తిరావు

హొసపేటె, న్యూస్‌టుడే: నేరాల నియంత్రణలో ప్రజల సహకారం పోలీస్‌ శాఖకు చాలా అవసరమని హరపన హళ్లి డీఎస్పీ హాలమూర్తిరావు పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ, హడగలి వర్తకుల సంఘాల ఆర్థిక సహాయంతో హడగలి పట్టణంలో ఏర్పాటు చేసిన నిఘా కెమేరాల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి హడగలిలో జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేరాలు జరిగినప్పుడు ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలి. నేరస్థుడిని పట్టుకోవటానికి మీ సమాచారం ఉపయోపడుతుందన్నారు. గొడవలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ముందుగానే తెలిస్తే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజలు పూర్తిస్థాయిలో పోలీస్‌ శాఖకు సహకరిస్తే తప్పకుండా నేరాలను నియంత్రణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వర్తకుల సంఘం వారు ఆర్థికంగా ఆదుకున్నందుకు హడగలి పట్టణంలోని ప్రముఖ 7 కూడళ్లలో 11 నిఘా కెమేరాలను ఏర్పాటు చేశామని హర్షం వ్యక్తం చేశారు. సీఐ రమేశ్‌ కులకర్ణి, ఎస్సైలు సంతోష్‌ డబ్బిన్‌, గంగాధర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని