logo

గోసాయి కనుమా..వెండితెర చిరునామా!

పక్కనే హోరెత్తుతూ ప్రవహించే కావేరి నది.. ఒడ్డునే విశాలమైన వేదిక.. ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా నిర్మించిన మెట్లు- స్నాన ఘట్టాలు..సమీపంలోనే కనుచూపుమేరలో పచ్చటి పొలాలు..అక్కడక్కడా కొబ్బరితోటలు..ఇంతకంటే అద్భుత దృశ్యాలు అవసరమా? అందుకే సినీ దర్శకులకు అచ్చుమెచ్చు ప్రాంతంగా గుర్తింపు పొందింది. జిల్లాలోని ప్రముఖ చారిత్రక పట్టణమైన శ్రీరంగపట్టణకు

Published : 27 Jun 2022 02:47 IST

వేలాది చిత్రాలకు లొకేషన్‌

నది మధ్యలోని బండరాళ్లపై తీసిన సన్నివేశాలు ఎన్ని సినిమాల్లో కనిపిస్తాయో
 

మండ్య, న్యూస్‌టుడే: పక్కనే హోరెత్తుతూ ప్రవహించే కావేరి నది.. ఒడ్డునే విశాలమైన వేదిక.. ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా నిర్మించిన మెట్లు- స్నాన ఘట్టాలు..సమీపంలోనే కనుచూపుమేరలో పచ్చటి పొలాలు..అక్కడక్కడా కొబ్బరితోటలు..ఇంతకంటే అద్భుత దృశ్యాలు అవసరమా? అందుకే సినీ దర్శకులకు అచ్చుమెచ్చు ప్రాంతంగా గుర్తింపు పొందింది. జిల్లాలోని ప్రముఖ చారిత్రక పట్టణమైన శ్రీరంగపట్టణకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని గోసాయిఘాట్‌కు ఓ ప్రత్యేక ఉంది. అక్కడ వేలాది సినిమాల చిత్రీకరణలు కొనసాగాయని స్థానికులు చెబుతారు. ప్రాచీన ఆలయం, అనేక మంటపాలు..ప్రత్యేకమైన సెట్‌ల కోసం రూ. లక్షల్లో వ్యయం చేయాల్సిన శ్రమ ఏమాత్రం ఉండదు. ఐటీ వర్గాలు చెబుతున్నట్లు ప్లగ్‌ అండ్‌ వర్క్‌ తరహాలో గోసాయి ఘాట్‌లో కెమెరాల్ని అమర్చి ఎంచక్కా చిత్రీకరణల్ని కొనసాగించడమే. సినిమాల కోసమే అన్నట్లుగా అక్కడి నిర్మాణాలున్నాయి. మరెలాంటి మార్పులు లేకుండానే అనేకమంది దర్శకులు గోసాయి ఘాట్‌లో తమ సినిమాల చిత్రీకరణల్ని చేపడుతుంటారని చెబుతారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ...ఇలా అనేక భాషల సినిమాల చిత్రీకరణలకు గోసాయి ఘాట్‌ వేదికగా ఉందని చెబుతారు. సమీపంలోనే ఉన్న మైసూరు నగరంలో బస చేసి ఉదయం వచ్చి సాయంత్రానికి చిత్రీకరణల్ని పూర్తి చేసుకుని వెనుతిరిగేందుకు వీలుంటున్నందునే అనేక మంది ఈ ప్రాంతానికి వస్తుంటారని తెలిపారు. జిల్లాలోని మేలుకోటె, కరిఘట్ట, శ్రీరంగపట్టణ ప్రాంతాలన్నీ సినిమాల చిత్రీకరణలకు ఏర్చికూర్చినట్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఒకవిధంగా ఈ పరిసరాల్లోనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకునేందుకు అనువైన అన్ని లొకేషన్లూ లభిస్తాయంటారు. అన్నట్లు ఈ ఘాట్‌కు సమీపంలోనే అత్యంత శక్తిమంతమైన దేవతగా భావించే నిమిషాంబ ఆలయం కూడా ఉంది. కోరిన కోర్కెల్ని తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి గుర్తింపు ఉంది.

గోసాయి ఘాట్‌ విహంగ వీక్షణం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని