logo

కొలంబియా మత్తులో చిత్తు

మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న సిగిల్‌ వర్ఘీస్‌, అతనితో సహజీవనం చేస్తున్న విష్ణుప్రియల విచారణను పూర్తి చేశామని జాయింటు పోలీసు కమిషనర్‌ ఎస్‌.డి.శరణప్ప తెలిపారు.

Published : 04 Dec 2022 01:41 IST

స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న సిగిల్‌ వర్ఘీస్‌, అతనితో సహజీవనం చేస్తున్న విష్ణుప్రియల విచారణను పూర్తి చేశామని జాయింటు పోలీసు కమిషనర్‌ ఎస్‌.డి.శరణప్ప తెలిపారు. ఇటీవల అరెస్టు చేసిన వీరి నుంచి రూ.25 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనపరుచుకున్నారు. వీరి వద్ద.. కొలంబియా నుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న నిందితుడి చిత్రాన్ని, వివరాలను సంపాదించామని చెప్పారు. కొలంబియాలో అధోలోకపు నేరగాడు పబ్లో ఎస్కోబార్‌ను వీరిద్దరూ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. పచ్చబొట్లు వేస్తూ తిరిగే వీరు.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి డ్రగ్స్‌ ఓ పథకం ప్రకారం చేరవేసేవారు. తమకు ఇష్టం వచ్చిన బస్టాప్‌, చెట్లు, పాదచారి మార్గాలు, చెత్త కుండీల సమీపంలో మాదక ద్రవ్యాన్ని ఉంచి, వాటి ఫొటోను వినియోగదారులకు పంపించేవారు. చందాపురలో సహజీవనం చేస్తున్న వీరి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా విదేశాలలో తలదాచుకున్న పలువురు డ్రగ్‌ డీలర్ల వివరాలను గుర్తించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఆయా ప్రాంతాల దర్యాప్తు సంస్థల సహకారంతో మాదక ద్రవ్యాల తరలింపును అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల్లో 27 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.15 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనపరుచుకున్నామని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఆ నిందితులు అందరూ 20-25 ఏళ్ల వయసు వారని, కొందరు టెకీలు కాగా మరికొందరు ప్రైవేటు కంపెనీ ఉద్యోగులని తెలిపారు. అదనపు సంపాదన కోసం వీరు అడ్డదారి పట్టారని వివరించారు.

సిగిల్‌ వర్ఘీస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని