logo

ప్రబంధ పోటీల్లో లక్ష్మీ మానస సత్తా

సింధనూరు యువతి లక్ష్మీ మానస ప్రబంధ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం పొంది అబ్బుర పరిచింది. ఆమెను రాయచూరు విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన సదస్సుకు ఆహ్వానించి విద్యార్థిని సత్కరించింది.

Published : 04 Feb 2023 01:39 IST

రాయచూరు విశ్వవిద్యాలయం సన్మానం స్వీకరిస్తున్న లక్ష్మీ మానస

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు యువతి లక్ష్మీ మానస ప్రబంధ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం పొంది అబ్బుర పరిచింది. ఆమెను రాయచూరు విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన సదస్సుకు ఆహ్వానించి విద్యార్థిని సత్కరించింది. రిజిస్ట్రార్‌, తదితరులు ఆమెను సన్మానించి మైసూరు విశ్వవిద్యాలయం నుంచి లభించిన జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. లక్ష్మీ మానస స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ కళాశాలలో బీఏ అంతిమ ఏడాది చదువుతోంది. మైసూరు విశ్వవిద్యాలయం ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర అంతర్‌ విశ్వవిద్యాలయాల రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించింది. కిందటేడాది ఆగస్టు 10న పోటీలు జరగ్గా లక్ష్మీ మానస ప్రథమస్థానం పొందిన విషయాన్ని ప్రకటించి అభినందన పత్రం మాత్రం పంపింది. జ్ఞాపిక, ప్రమాణపత్రం, తదితరాలను రాయచూరు విశవిద్యాలయానికి అందజేసింది. రాయచూరు విశ్వవిద్యాలయం తరఫున పాల్గొని ప్రథమ స్థానం దక్కించుకుని రాష్ట్రస్థాయిలో కీర్తిని చాటిన ఆమెను యాజమాన్యం ప్రశంసించింది. మైసూరులో కాకుండా మా జిల్లాలో రిజిస్ట్రార్‌ చేతుల మీదుగా ఈ పత్రాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని విజేత లక్ష్మీ మానస పేర్కొన్నారు.

మైసూరు విశ్వవిద్యాలయం అందించిన జ్ఞాపిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని