logo

ప్రగతి సాధకులకు జనం పట్టం

రానున్న ఎన్నికలలో ప్రజలు అభివృద్ధికి పెద్ద పీట వేసి భాజపాను గెలిపిస్తారని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 19 Mar 2023 02:13 IST

ప్రచార రథంపై జేపీ నడ్డా, కటీల్‌, యడియూరప్ప

బెంగళూరు గ్రామీణ, తుమకూరు, న్యూస్‌టుడే : రానున్న ఎన్నికలలో ప్రజలు అభివృద్ధికి పెద్ద పీట వేసి భాజపాను గెలిపిస్తారని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన శనివారం తిపటూరులో విజయ సంకల్ప రథయాత్రలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాధనలను ప్రజలు గమనించాలని కోరారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్న పథకం ద్వారా కరోనా మహమ్మారి సమయంలో 80 కోట్ల మందికి నిత్యావసర సరుకులు మంజూరు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా తొమ్మిదేళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం భారీగా చేపట్టామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే.. కమీషన్‌, అవినీతి, నేరగాళ్లు, కుటుంబ పార్టీ అని విమర్శించారు. ఈసారి కర్ణాటకలో కనీసం 140 స్థానాలు గెలుస్తామన్నారు. పార్టీ నాయకులు ఆర్‌.అశోక్‌, బీసీ నాగేశ్‌, సచ్చిదానందమూర్తి, ఎంబీ నందీశ్‌, రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

* విజయ సంకల్ప యాత్ర ముగింపు వేడుకలలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి కర్ణాటకకు రానున్నారు. ఉద్యాననగరిలో మార్చి 25న కేఆర్‌పురం-వైట్ ఫీల్డ్‌ వరకు మెట్రో రైలు మార్గాన్ని మోదీ ప్రారంభిస్తారు. అదే సమయంలో ఒకటిన్నర కిలోమీటరు రోడ్‌ షోకు సన్నాహాలు చేస్తున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ తెలిపారు. తిపటూరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి విజయ సంకల్పరథ యాత్రను నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని