logo

పొరుగు సాక్ష్యం సరిపోదు

తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడంటూ ఓ వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై ఇరుగు పొరుగువారు చెప్పిన మాటల ఆధారంగా శిక్షను విధించడం సరికాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Published : 22 Mar 2023 02:49 IST

శివాజీనగర, న్యూస్‌టుడే : తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడంటూ ఓ వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై ఇరుగు పొరుగువారు చెప్పిన మాటల ఆధారంగా శిక్షను విధించడం సరికాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రవర్తనను ఇరుగు పొరుగులు ఎలా నిర్ణయిస్తారని జస్టిస్‌ హెచ్‌బీ ప్రభాకరశాస్త్రి, జస్టిస్‌ సీఎం జోషిల నేతృత్వంలోని పీఠం ప్రశ్నించింది. ఇరుగు పొరుగు వాంగ్మూలం ఆధారంగా నిందితునికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది. మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. బాగలకోట హున్డేకర్‌ గల్లీలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఒక గృహిణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు, ఆమె భర్తే అతన్ని హత్య చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇరుగు పొరుగులు ఇచ్చిన వాంగ్మూలంతోనే కేసు నమోదు చేశారని, దిగువ న్యాయస్థానం జీవిత ఖైదును విధించిందంటూ బాధితుడు వేసుకున్న అర్జీపై విచారణ పూర్తి చేసి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని