logo

దయలేని అమరేంద్ర

సంతానం లేదని కొందరు గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. మరికొందరు ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకుని సంతాన భాగ్యం కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు.

Published : 02 Jun 2023 02:36 IST

ఇద్దరు బిడ్డలను హత్య చేసిన తండ్రి

దావణగెరె, న్యూస్‌టుడే : సంతానం లేదని కొందరు గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. మరికొందరు ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకుని సంతాన భాగ్యం కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు. దావణగెరెకు చెందిన అమర్‌ అలియాస్‌ అమరేంద్ర (36)కు అద్వైత్‌, అన్విత్‌ నిష్కరుణి అనే నాలుగేళ్ల కవల పిల్లలు ఉన్నారు. గోకాక్‌కు చెందిన అమర్‌ తన భార్యాబిడ్డలు, తల్లి సావిత్రమ్మతో కలిసి ఆంజనేయ లేఅవుట్లో ఉంటున్నారు. హరిహరలోని కార్గిల్‌ ఫ్యాక్టరీలో కెమికల్‌ ఇంజినీరుగా పని చేసేవారు. అమర్‌తో గొడవ పడి.. అతని భార్య జయలక్ష్మి బిడ్డలను భర్త వద్దే విడిచి పెట్టి విజయపురలోని పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి సావిత్రమ్మ నిద్రపోయిన తర్వాత బుధవారం రాత్రి తన పిల్లలు ఇద్దరినీ కారులోకి ఎక్కించుకుని హావేరి జిల్లా రాణె బెన్నూరు తాలూకా చళగేరి టోల్‌ గేట్‌ సమీపంలోని సర్వీసు రోడ్డుకు అమర్‌ చేరుకున్నాడు. కారులోని బిడ్డల నోరు, ముక్కుకు సెల్లోటేపుతో చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని పోలీసు అధికారులు గుర్తించారు. మృతదేహాలను రహదారి పక్కనే వదిలి వెళ్లిపోయాడని వివరించారు. మృతదేహాలను గుర్తించి, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో టోల్‌గేటు సమీపంలోని కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వాహనం నంబరు ఆధారంగా అమర్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. తానే ఇద్దరు బిడ్డలను హత్య చేశానని నిందితుడు అంగీకరించడం ప్రస్తావనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని