logo

న్యాయం కోరుతూ దిల్లీకి ఎడ్లబండి యాత్ర

తమ కూతురికి న్యాయం చేయాలని దిల్లీలోని సుప్రీంకోర్టు వరకు ఎడ్లబండి యాత్ర చేపట్టారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన నేలవెల్లి జ్యోతి, నాగదుర్గారావు.

Published : 25 May 2022 01:44 IST

తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్ల నుంచి ఎడ్లబండి

యాత్ర చేస్తున్న తల్లీకొడుకులు

బోనకల్లు, న్యూస్‌టుడే: తమ కూతురికి న్యాయం చేయాలని దిల్లీలోని సుప్రీంకోర్టు వరకు ఎడ్లబండి యాత్ర చేపట్టారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన నేలవెల్లి జ్యోతి, నాగదుర్గారావు. ఈ యాత్ర మంగళవారం బోనకల్లు చేరుకుంది. ఈ సందర్భంగా దుర్గారావు విలేకరులతో మాట్లాడుతూ... యాత్ర చేపట్టడానికి కారణాలు వివరించారు. తన సోదరి నవ్యతను చందర్లపాడు గ్రామానికి చెందిన గుత్తేదారు కంఠమనేని నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. నాటి నుంచి తన సోదరిని వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. 2020లో తమ సోదరి తమ ఇంటికి వచ్చిందని చెప్పారు. 2021లో కేసు పెట్టామని తెలిపారు. వివాహ సమయంలో రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల భూమి ఇచ్చామని , తన సోదరిని వేధించి పుట్టింటికి వెళ్లగొట్టారని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని తమకు న్యాయం చేయాలని కోరుతూ దిల్లీ సుప్రీంకోర్టుకు తన తల్లితో కలిసి ఎండ్లబండి యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని