logo

దివ్యాంగుడికి ప్రభుత్వ సాయం

వుధిర పురపాలకంలోని యాదవబజారుకు చెందిన దివ్యాంగుడు తూము సుబ్బారావుకు ప్రభుత్వ  సాయమందింది.

Published : 30 Mar 2023 05:07 IST

సుబ్బారావుకు వాహనం అందిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, అధికారులు

మధిర పట్టణం, న్యూస్‌టుడే: వుధిర పురపాలకంలోని యాదవబజారుకు చెందిన దివ్యాంగుడు తూము సుబ్బారావుకు ప్రభుత్వ  సాయమందింది. లారీ డ్రైవరుగా చేస్తున్న సమయంలో నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ నడుము కింద భాగం చచ్చుపడి మంచానికే పరిమితమయ్యాడు. అమ్మమ్మ ఆసరాతో జీవనం సాగిస్తూ మందులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతడి దయనీయ పరిస్థితిపై ‘ఈనాడు’లో ఈ నెల 18న ‘బతుకుబండి నడిచేదెలా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు విచారణకు ఆదేశించారు. అధికారులు అందించిన నివేదికతో హుటాహుటిన సుబ్బారావుకు మూడు చక్రాల మోటారు వాహనాన్ని మంజూరు చేయించారు. ఖమ్మం జడీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, జిల్లా సంక్షేమ అధికారి సీహెచ్‌ సంధ్యారాణి, క్షేత్ర స్పందన అధికారి డి.సునీల్‌కుమార్‌ చేతుల మీదుగా సుబ్బారావుకు బుధవారం వాహనాన్ని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని