logo

పాలు.. ఆరోగ్యానికి మేలు

ఏటా జూన్‌ 1న ప్రపంచవ్యాప్తంగా క్షీర దినోత్సవం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Published : 01 Jun 2023 03:28 IST

నేడు ‘ప్రపంచ క్షీర దినోత్సవం’

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఏటా జూన్‌ 1న ప్రపంచవ్యాప్తంగా క్షీర దినోత్సవం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 100 శాతం పోషక విలువలు, విటమిన్‌ బి-12 అధికంగా కలిగిన ఇవి యుక్త వయసు పిల్లల్లో, విద్యార్థుల్లో, మానసిక, శారీరక ఉత్సాహాన్ని, పెరుగుదలను, ఎముకల పటుత్వాన్ని పెంచుతాయి. రానురాను వాతావరణ సమతుల్య లోపం, వర్షాలు లేక, గ్రాసం కొరతతో పశుపోషణ కష్టమైంది. పాల ఉత్పత్తీ తగ్గిపోతోంది. దీన్నో వ్యాపార వస్తువుగా మలచుకుని అనేక ప్రైవేటు డెయిరీలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో నిల్వ కోసం అనేక రకాల రసాయనాలు కలుపుతున్నారు. దీంతో పోషకాల సంఖ్య సైతం తగ్గిపోతోంది.

పుట్టుగొడుగుల్లా...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రైవేటు డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రకరకాల ఆఫర్ల ఎర చూపించి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. దీనికి తోడు పొరుగు రాష్ట్రాలకు చెందిన అనేక డెయిరీలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ సహకార సమాఖ్యకు చెందిన విజయ డెయిరీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నాణ్యమైన పాలకు మారుపేరుగా నిలిచిన ఈ సంస్థ మనుగడ ఇప్పుడు కష్టమవుతోంది.


పాల ఉత్పత్తులు పెంచేందుకు కృషి...
- డాక్టర్‌ ఎ.కుమారస్వామి, ఉప సంచాలకుడు, విజయ డెయిరీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా

పాడి రైతులకు నూతన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించటం ద్వారా పాల దిగుబడిని 25 నుంచి 30 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. విజయ డెయిరీ, ఎస్‌బీఐ, పాడి రైతులతో కలిపి ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా రైతులు పాడి పశువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను అందిస్తాయి. ఒకటి నుంచి మూడు పాడి పశువుల కొనుగోలు నిమిత్తం రుణాలు అందిస్తారు. రైతుల పాల బిల్లులో ఈ రుణాలను మినహాయించుకుంటారు. కొత్తగా 15 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని