logo

భారాస పాలనలోనే ఇల్లెందు అభివృద్ధి: సత్యవతి రాథోడ్‌

పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భారాస  అభ్యర్థి మాలోత్‌ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం

Published : 10 May 2024 04:29 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, పక్కన ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ

ఇల్లెందు, న్యూస్‌టుడే: పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భారాస  అభ్యర్థి మాలోత్‌ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రజలను మోసగించిందని, భారాస హయాంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో మహోత్తర పథకాలు అమలుచేశామని తెలిపారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మరోసారి దేశ ప్రజలను మోసగించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, దిండిగాల రాజేందర్‌,    ఎస్‌.రంగనాథ్‌, కౌన్సిలర్లు జేకే శ్రీను, కటకం పద్మావతి, కడకంచి పద్మ, లలిత శారద, బిందు, వీణ తదితరులు పాల్గొన్నారు.

మాయమాటలకు తలొగ్గి మోసపోవద్దు: కవిత

గుండాల, ఆళ్లపల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భాజపా  నాయకుల మాయమాటలు, ప్రలోభాలకు తలొగ్గి మోసపోవద్దని భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత అన్నారు.  గుండాల, ఆళ్లపల్లి మండలం పెద్దూరులలో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆమె మాట్లాడారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి  అధికారంలోకి వచ్చారని విమర్శించారు. హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. భారాస హయాంలో అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, గుండాల, కోలేటి భవానీశంకర్‌, వట్టం రాంబాబు, ఎంపీపీ  మంజు భార్గవి, జడ్పీటీసీ సభ్యుడు హన్మంతరావు, పాయం నర్సింహారావు తెల్లం భాస్కర్‌, ఎడ్ల శ్రీనివాస్‌  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని