logo

రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: భట్టి

ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు.

Published : 10 May 2024 04:38 IST

ఎర్రుపాలెంలో ప్రజలకు అభివాదం చేస్తున్న భట్టి విక్రమార్క, పొంగులేటి, రఘురాంరెడ్డి

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీలు అమలుచేశామని, మహిళలకు వడ్డీ రాయితీ అందిస్తున్నామని చెప్పారు. సాగునీటిని రెండో జోన్‌లోకి తెస్తున్నామని తెలిపారు. రైల్వేగేట్‌ వద్ద ఆర్వోబీ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో భాజపా పేదలకు చేసిందేమీ లేదని, పదేళ్ల భారాస పాలనలో ఆపార్టీ నాయకులు దోచుకుతిన్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి రఘురాంరెడ్డిని  గెలిపించాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వరరెడ్డి, కోటా రాంబాబు, వి.సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ డి.శిరీష, బి.నరసింహారావు, ఏవీ.కృష్ణారావు, ఎస్‌.శ్రీనివాసరెడ్డి, షేక్‌ ఇస్మాయిల్‌, ఎం.లక్ష్మణరావు, బాబూరావు, డి.శ్రీనివాస్‌, తిరుపతమ్మ,   రాజీవ్‌గాంధీ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలపై రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం: రేణుకాచౌదరి

ఖమ్మం కమాన్‌బజార్‌: రాష్ట్రంలో పదేళ్లు పాలన సాగించిన కేసీఆర్‌ ప్రజలపై రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఎంపీ రేణుకాచౌదరి విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలోని ఆదిలక్ష్మి కోల్డ్‌ స్టోరేజ్‌లో వ్యాపారులు, కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. భారాస పనైపోయిందని.. కేంద్రంలో భాజపాకు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. అన్ని వర్గాల  సంక్షేమానికి దిక్సూచిలా ఉన్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి జిల్లాకు నిధులు తీసుకురావడంలో భారాస విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకులు తుమ్మల యుగంధర్‌, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, సీపీఐ నాయకులు భాగం హేమంతరావు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కన్నా లోక్‌సభ ఎన్నికల్లో  అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మానుకొండ రాధాకిశోర్‌,   టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, స్వర్ణకుమారి, బాలగంగాధర్‌ తిలక్‌, జానీమియా, ముస్తాఫా పాల్గొన్నారు.

తల్లాడ: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు.     కుర్నవల్లి, కలకొడిమ, పినపాక, తల్లాడ, మల్లారం గ్రామాల్లో   ఎమ్మెల్యే మట్టా రాగమయి, సీపీఎం నాయకులతో కలిసి  ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మువ్వా విజయబాబు, స్వర్ణకుమారి, కాపా సుధాకర్‌, దగ్గుల రఘుపతిరెడి, అయిలూరి వెంకటకోటారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తాతా భాస్కరరావు, అయినాల రామలింగేశ్వరరావు, మాచర్ల భారతి, మాదినేని రమేష్‌, గుర్రం శ్రీను, ఎర్రి నరసింహారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని