logo

ఎమ్మెల్యేకు సమస్యలు వెల్లువ

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా  అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సోమవారం చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పర్యటించగా వివిధ సమస్యలపై ప్రజలు ఏకరవుపెట్టారు. వైకాపా బూత్‌ కన్వీనరు

Published : 24 May 2022 03:28 IST

రేషన్‌ కార్డు రద్దయిందని ఎమ్మెల్యేకి చెబుతున్న వైకాపా నాయకుడు శ్రీనివాసరావు

చల్లపల్లి, న్యూస్‌టుడే : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా  అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సోమవారం చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పర్యటించగా వివిధ సమస్యలపై ప్రజలు ఏకరవుపెట్టారు. వైకాపా బూత్‌ కన్వీనరు కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ గృహ నిర్మాణ రుణం కోసం 2019లో ఐటీ రిటర్నులు దాఖలు చేస్తే బియ్యం కార్డు రద్దయిందన్నారు. ఎంతో మందికి ఐటీ చెల్లించేవారికి సైతం కార్డులున్నాయన్నారు. మూడేళ్లుగా తన సమస్య పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేయగా సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బీటెక్‌ చివరి సంవత్సరం పూర్తి చేసిన ఆరేపల్లి నవీన్‌ తనకు విద్యాదీవెన కింద చివర విడత రావాల్సిన రూ.15 వేలు రాలేదని, ఉద్యోగం రావడంతో ధ్రువపత్రాలు తెచ్చుకునేందుకు తనే డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని వాపోయాడు.
మూడో వార్డులో మహిళలు తాగునీరు, రహదారి సమస్యలపై ఏకరవు పెట్టారు. వార్డు సభ్యురాలు యార్లగడ్డ తులసి గౌడపాలెంలో సిమెంటు రహదారి నిర్మించాలని కోరారు. పరసా వాణి, కాగిత రమేష్‌బాబు, శివనాగమల్లేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ పంచాయతీ ట్యాప్‌లు లేకపోవడంతో తాగునీరు పట్టుకునేందుకు నానాపాట్లు పడుతున్నట్లు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని