logo

ఈతకు వెళ్లిన బాలుడు గలంతు

తండ్రితో కలసి అన్నదమ్ములు ఈతకు వెళ్లారు. తమ్ముడు నీటిలో మునిగి గల్లంతైన ఘటన మండలంలోని జొహరాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన వీరేష్, లక్ష్మి దంపతులకు

Published : 19 May 2022 06:27 IST

 జొహరాపురంలో విషాదం 


బావి వద్ద గుమిగూడిన జనం 

ఆస్పరి, న్యూస్‌టుడే: తండ్రితో కలసి అన్నదమ్ములు ఈతకు వెళ్లారు. తమ్ముడు నీటిలో మునిగి గల్లంతైన ఘటన మండలంలోని జొహరాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన వీరేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు వినోద్, చిన్న కుమారుడు విష్ణువర్దన్‌(12) తండ్రితో కలిసి బుధవారం గ్రామానికి సమీపంలోని వెంకన్న దిగుడుబావిలో ఈతకు వెళ్లారు. ఈత ఆడాక తండ్రి, పెద్ద కుమారుడు బయటకు వచ్చారు. చిన్న కుమారుడు విష్ణువర్దన్‌ బయటకు వచ్చి మరోసారి బావిలోకి పైనుంచి దూకడంతో పూడికలోకి ఇరుక్కుపోయాడు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటలకు వరకు గాలించినా.. బాలుడి ఆచూకీ తెలియరాలేదు. గ్రామస్థులు, పత్తికొండ అగ్నిమాపక ఎస్సై దినకర్‌బాబు సిబ్బంది, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం ఆరు ట్రాక్టర్లతో మోటర్లు పెట్టి నీటిని బయటకు తోడేస్తున్నారు. గ్రామస్థులంతా బావి వద్ద గుమిగూడారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని