logo

ఆభరణాలు, రూ.5.24 లక్షల నగదు సీజ్‌

ఆదోని పట్టణంలోని షరాఫ్‌బజారులో గురువారం ఎలాంటి బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు, భారీ నగదును తీసుకెళ్తున్న సి.బెళగల్‌కు చెందిన రమేశ్‌ ఆచారి అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. అతని వద్ద నుంచి రూ.5.24 ల

Published : 20 May 2022 06:22 IST


బంగారు ఆభరణాలు, నగదును చూపిస్తున్న సీఐ విక్రమసింహా

 

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని షరాఫ్‌బజారులో గురువారం ఎలాంటి బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు, భారీ నగదును తీసుకెళ్తున్న సి.బెళగల్‌కు చెందిన రమేశ్‌ ఆచారి అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. అతని వద్ద నుంచి రూ.5.24 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు గుర్తించామన్నారు. వాటికి సంబంధించి ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేశామన్నారు. ఐటీ శాఖ, వాణిజ్య పన్నుల శాఖకు నివేదికలు పంపించామన్నారు. వారిచ్చే నివేదికలు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని