logo

పచ్చని పంట.. నల్లగా మారింది

పచ్చని పంట నల్లని రంగేసినట్లుగా ఇలా ఎలా మారిందని  అనుకుంటున్నారా...అయితే మీరు పొరబడినట్లే. ఇది పెసర పంట. దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డినగర్‌ గ్రామంలోని అధికమంది రైతులు పెసర, మినుము పంటసాగు చేశారు. ప్రస్తుతం అవి కోత దశకు వచ్చాయి. కోసి కుప్పలు వేస్తే వర్షానికి పంట మొత్తం దెబ్బతింటుంది.దీంతో రైతులే పంటకు గడ్డి

Published : 13 Aug 2022 00:39 IST

నల్లగా మారిన పెసర పంట

పచ్చని పంట నల్లని రంగేసినట్లుగా ఇలా ఎలా మారిందని  అనుకుంటున్నారా...అయితే మీరు పొరబడినట్లే. ఇది పెసర పంట. దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డినగర్‌ గ్రామంలోని అధికమంది రైతులు పెసర, మినుము పంటసాగు చేశారు. ప్రస్తుతం అవి కోత దశకు వచ్చాయి. కోసి కుప్పలు వేస్తే వర్షానికి పంట మొత్తం దెబ్బతింటుంది.దీంతో రైతులే పంటకు గడ్డి మందు పిచికారి చేశారు. పెసర ఆకులు ఎండిపోయి ఎండిన పెసర కాయలు మాత్రమే ఉంటాయి. దీంతో వర్షాల నుంచి పంటను దక్కించుకోవచ్చని రైతులు చెబుతున్నారు.

-న్యూస్‌టుడే, దొర్నిపాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని