logo

పెన్సిల్‌పై జాతీయ పతాకం

ఆదోని మండలం అలసందగుత్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి గోవర్దన్‌ తన సూక్ష్మకళతో శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

Published : 15 Aug 2022 02:02 IST

పెన్సిల్‌ ముక్కపై జాతీయ పతాకం

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఆదోని మండలం అలసందగుత్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి గోవర్దన్‌ తన సూక్ష్మకళతో శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పెన్సిల్‌ ముక్కుపై 0.8 మిల్లీ మీటరు పొడవుతో అతి చిన్న జాతీయ పతాకాన్ని రూపొందించాడు. పాఠశాల డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడు కీరా ప్రోత్సాహంతో దీన్ని తయారు చేసినట్లు విద్యార్థి పేర్కొన్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రియాజుద్దీన్‌, ఉపాధ్యాయులు శేఖన్న, నర్సయ్య, మౌలాలి, పెద్దయ్య, జయరాంనాయక్‌, అమీనాబీ, కృష్ణవేణి విద్యార్థిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని