logo

హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం

హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేయడానికి పీఠాధిపతులు కృషి చేస్తున్నారని శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి అన్నారు.

Published : 27 Nov 2022 02:34 IST

మాట్లాడుకుంటున్న పీఠాధిపతులు

మంత్రాలయం, న్యూస్‌టుడే: హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేయడానికి పీఠాధిపతులు కృషి చేస్తున్నారని శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి అన్నారు. ‘స్వధర్మ వాహిని ప్రచార యాత్ర’లో భాగంగా శనివారం ఆయన మంత్రాలయానికి వచ్చారు. ఉత్తరాధికారికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని హారతి ఇచ్చారు. అనంతరం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. శారద, రాఘవేంద్రస్వామి మఠానికి పూర్వం నుంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం, వాటిని విశ్వవ్యాప్తం చేయడానికి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు కృషిచేస్తున్నారని తెలిపారు. అనంతరం ఉత్తరాధికారిని అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతిచార్‌, నరసింహమూర్తి, అనంత, ప్రకాశ్‌రావు, సాయినాథ్‌, శ్రీకాంత్‌, మధుసూదన్‌ శర్మ, సూర్యనారాయణ, భాస్కర్‌, వీరేష్‌, సిద్ధు, ప్రవీణ్‌, వీరభద్ర, ఎల్లాలింగా, ఏఎస్‌ఐ ఆనందరెడ్డి, ఆడిట్‌ శంకర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని