logo

కనులపండువగా జ్యోతుల ఉత్సవం

బనగానపల్లి మండలం నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతి మహోత్సవం కనుల పండువగా జరిగింది.

Updated : 27 Mar 2023 06:10 IST

జ్యోతులతో వస్తున్న భక్తులు

నందవరం (బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: బనగానపల్లి మండలం నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతి మహోత్సవం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున నుంచే జ్యోతులు చెన్నకేశవస్వామి ఆలయం నుంచి అమ్మవారి ఆలయానికి రావడంతో సందడి నెలకొంది. నృత్యాలు, డప్పు వాయిద్యాలతో జ్యోతులు తీసుకుని భక్తులు రావడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. అమ్మవారికి కుంకుమార్చనలు, పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. పలుకూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి జయమ్మ, ఎస్పీ రఘువీర్‌రెడ్డి సతీమణి కల్యాణి వేర్వేరుగా వచ్చి అమ్మవారికి పూజలు చేశారు.

పూజలందుకున్న అమ్మవారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని