logo

పెద్ద పులి దాడిలో గేదె మృతి

ఆత్మకూరు మండలం ముష్టేపల్లి గ్రామ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జడలయ్య బేస్‌ క్యాంప్‌ సమీపంలో గేదెల మందపై పెద్దపులి దాడి చేసినట్లు రైతులు, పశువుల కాపరులు తెలిపారు.

Published : 03 Jun 2023 01:57 IST

పెద్ద పులి పాదముద్రలు

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఆత్మకూరు మండలం ముష్టేపల్లి గ్రామ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జడలయ్య బేస్‌ క్యాంప్‌ సమీపంలో గేదెల మందపై పెద్దపులి దాడి చేసినట్లు రైతులు, పశువుల కాపరులు తెలిపారు. ఈ ఘటనలో చిన్న లక్ష్మిరెడ్డికి చెందిన పాడిగేదె మృతి చెందింది. పశువుల కాపరి రామరాజునాయక్‌ శుక్రవారం గ్రామ శివారులోని పొలాల్లో గేదెలను మేపుతుండగా పెద్దపులి ఓ గేదెపై దాడి చేసిందన్నారు. తాను గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. తీవ్రంగా గాయపడిన గేదెను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా మర్గమధ్యలోనే మృతి చెందిందన్నారు. ఈ ప్రాంతంలో రెండు నెలలుగా పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని