logo

పేదోడి కల.. అసంపూర్తి మేడ

పేదోడికైనా.. పెద్దోడికైనా.. సొంతిల్లు కావాలనేది కల. వైకాపా పాలనలో ఐదేళ్లు ఆశగా చూశారు.. అసంపూర్తిగానే వదిలేశారు. గూడు దొరుకుతుందని కలలు కన్నారు.. చెదలు పట్టి చెదిరిపోయాయి. పొదరిల్లుగా చూసుకుందామనుకున్నారు.. ముళ్లపొదలతో నిండిపోయాయి.

Updated : 16 Apr 2024 06:40 IST

ఈనాడు, కర్నూలు

పేదోడికైనా.. పెద్దోడికైనా.. సొంతిల్లు కావాలనేది కల. వైకాపా పాలనలో ఐదేళ్లు ఆశగా చూశారు.. అసంపూర్తిగానే వదిలేశారు. గూడు దొరుకుతుందని కలలు కన్నారు.. చెదలు పట్టి చెదిరిపోయాయి. పొదరిల్లుగా చూసుకుందామనుకున్నారు.. ముళ్లపొదలతో నిండిపోయాయి. ఇంటి తాళాలు ఇస్తామని.. తలుపులు మూశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదల గూడు గోడు వినిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో పాటు ఆదోని, ఆళ్లగడ్డ పురపాలక సంఘాల్లో టిడ్కో గృహాల దుస్థితికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు.  


ముళ్లపొదల సముదాయం

ఆదోనిలో అధ్వానంగా టిడ్కో ఆవరణం


పునాదులకే పరిమితం

సాగని నిర్మాణాలు


దాహం తీరేదెలా..

ఆళ్లగడ్డలో టిడ్కో గృహాల వద్ద నిర్మాణంలో ఉన్న ఓవర్‌హెడ్‌ ట్యాంకు, పక్కనే గృహాలు


నివాసాలకు ఆటంకాల ముళ్లు

నంద్యాలలో పెరిగిన ముళ్లపొదలు


ఇళ్లతో చెట్టాపట్టాలు

టిడ్కో గృహాలను దాటుతూ.. పైఅంతస్తుకు పాకుతున్న చెట్లు


ఆశలు ముక్కలు

కర్నూలు జగన్నాథగట్టు ప్రాంతంలో టిట్కో గృహాలకు పగిలిన కిటికీ అద్దాలు..


పేదల ఇళ్లలో చెదల పుట్టలు

టిడ్కోగృహాల లోపల గోడలకు చెదలు పట్టాయిలా..

చెదిరిన గదుల ఫ్లోరింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని