logo

నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు

 వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది.

Published : 23 Apr 2024 04:04 IST

తండ్రి, తనయుడు !

2019లో శిలాఫలకం ప్రారంభిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (దాచినచిత్రం)

చాగలమర్రి, న్యూస్‌టుడే :  వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.291కోట్లతో 2008లో శంకుస్థాపన చేశారు. నాటి నుంచి పనులు ప్రారంభం కాలేదు. ఏడాదికేడాది ప్రతిపాదనలు పెరుగుతూ నేడు రూ.1357.1కోట్లుగా మారింది. 2019 డిసెంబరు 23న ముఖ్యమంత్రి జగన్‌ దువ్వూరు మండలంలోని నేలటూరు గ్రామంలో రాజోలి ఆనకట్ట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఒకసారి తండ్రి, మరోసారి తనయుడు శంకుస్థాపనలు చేసి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.


గాలి కొదిలేశారు

గతేడాది జనవరిలో వంతెన పనుల శిలాఫలకంను ప్రారంభిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్‌

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే : హంద్రీ నదిపై నిర్మించే గోరంట్ల హైలెవల్‌ వంతెన రెండు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో అవసరమైనది. జగన్‌ పాదయాత్ర చేస్తున్న సమయంలో వంతెన సమస్య ఆయన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి అయిన వెంటనే నిర్మిస్తానని పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల ప్రజలకి హామీ ఇచ్చారు. 2023 జనవరిలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.21కోట్లతో శిలాఫలకం ప్రారంభించి పనులకు శ్రీకారం చుట్టారు. ఆరంభశూరత్వంగా ఐదారు నెలలు పనులు చేశారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో పలు గ్రామాల ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విద్యార్థులు, రైతులు, గ్రామస్థులకు తిప్పలు తప్పటం లేదు.


పనులు మరిచారు

గంజహళ్లి గ్రామశివార్లో రూ.47 కోట్లతో వంతెన  పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైకాపా అభ్యర్ధి బుట్టారేణుకా (పాతచిత్రం)

గోనెగండ్ల, న్యూస్‌టుడే : మండలంలో గాజులదిన్నేలో తెదేపా ప్రభుత్వ హయాంలో 11 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.13 కోట్లతో తాగునీటి పథకం పనులు చేపట్టారు. తిరిగి అవే  పనులకు జలజీవన్‌ మిషన్‌, సీపీడబ్ల్యూ స్కీం కింద 14 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.19.50 కోట్లతో 13.3.2024లో వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుట్టారేణుక పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన చేశారు. తాగునీటి పథకం వద్ద ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు.

గోనెగండ్ల మండలంలోని గంజహళ్లి గ్రామ శివారులో హంద్రీ నదిపై రూ.47 కోట్లతో చేపట్టే వంతెన నిర్మాణం కోసం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుట్టారేణుక 2024 మార్చి 12వ తేదీన భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని