logo

అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా

నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్‌ వేశారు.

Published : 23 Apr 2024 04:11 IST

నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి

మాట్లాడుతున్న నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి, వేదికపై ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్‌ వేశారు. పట్టణంలోని తన ఎన్నికల కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.    నూనెపల్లె ఉపరితల వంతెన కింద తెదేపా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.  మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులకు సాగునీరు ఇవ్వలేమంటూ అధికారులతో నోటీసులు ఇప్పించిన ఘనత దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. కాటసాని, శిల్పా కుటుంబాలతో పాటు గంగుల, బుగ్గన కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. నంద్యాల తెదేపా ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్‌ , జనసేన నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, సురేశ్‌, భాజపా నాయకులు మేడా మురళీధర్‌, చెరుకుచెర్ల రఘురామయ్య, తెదేపా రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, శబరి భర్త శివచరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

హాజరైన కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని