logo

అక్రమాలు చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా

మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా అని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని ఓబులాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లె, ఎర్రగుంట్ల, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 02:42 IST

సమావేశంలో మాట్లాడుతున్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

డోన్‌, న్యూస్‌టుడే: మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా అని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని ఓబులాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లె, ఎర్రగుంట్ల, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నీతి నిజాయతీతో రాజకీయాలు చేసిన అనవసర ఆరోపణలు తగవన్నారు. తాము అక్రమంగా రూ.కోట్లు సంపాదించలేదన్నారు. వైకాపా ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ఓబులాపురంలో  చనుగొండ్లలో పలువురు తెదేపాలోకి చేరారు. వారికి కండువాలు వేసి కోట్ల ఆహ్వానించారు.  తెదేపా రాష్ట్రకార్యదర్శి వలసలరామకృష్ణ, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి, శ్రీనివాసులు, మున్సిపల్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ కేశన్నగౌడ్‌, భరత్‌రెడ్డి, వెంకోబరావు, బజారు, వీరాంజనేయులు, గోరంట్ల, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని