logo

అహోబిలేశుని వసంతోత్సవం

అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు.

Published : 05 May 2024 02:49 IST

అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వసంతోత్సవ మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. పసుపు, చందనం, కర్పూరం సమర్పించి ధూపదీపాలతో మహామంగళహారతి అందించారు. స్వామి, అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు.  బీ అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పావన నృసింహస్వామి ఆలయాన్ని, ఎగువ, దిగువ ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు