logo

కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు

తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని..

Published : 05 May 2024 02:58 IST

నేడు ఆదోనిలో రాజ్‌నాథ్‌సింగ్‌ రోడ్‌షో

ఆదోనిలో హెలిప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆదోని భాజపా అభ్యర్థి డాక్టరు పార్థసారథి, కూటమి నాయకులు

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని.. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తిక్కారెడ్డి, ఆదోని భాజపా అభ్యర్థి డాక్టరు పార్థసారథి పిలుపునిచ్చారు. ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో చేపట్టిన హెలిప్యాడ్‌ పనులను శనివారం వారు పరిశీలించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత ఆదోని ప్రాంతం చాలా వెనుకబడి పోయిందని, అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులు చాలా అవసరమని పేర్కొన్నారు.  తెదేపా సీనియర్‌ నాయకులు ఉమాపతినాయుడు, గుడిసె కృష్ణమ్మ, దేవేంద్రప్ప, రామస్వామి, జనసేన ఆదోని బాధ్యుడు మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

  • ఆదోనిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన సందర్భంగా ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామితో తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, భాజపా అభ్యర్థి డాక్టరు పార్థసారథి చర్చించారు. హెలిప్యాడ్‌, భీమాస్‌ ప్రాంతంలో నిర్వహించే రోడ్‌కార్నర్‌ బహిరంగ సభ ప్రాంతంలో తీసుకుంటున్న రక్షణ చర్యలపై చర్చించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని