logo

పార్కులు ఏర్పాటుచేయని పాలకులు మాకొద్దు

కర్నూలు నగర పరిధిలోని కల్లూరు 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతమైందని.. తమకు పార్కు కావాలని ఆ కాలనీ హౌస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేశారు.

Published : 06 May 2024 03:28 IST

ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ కాలనీవాసుల నిరసన

నిరసన తెలుపుతున్న కాలనీవాసులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు నగర పరిధిలోని కల్లూరు 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతమైందని.. తమకు పార్కు కావాలని ఆ కాలనీ హౌస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన జరిపారు. కాలనీలో పార్కు స్థలం ఆక్రమణకు గురైనా పాలకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులు ఏర్పాటుచేయని పాలకులు తమకొద్దని పేర్కొన్నారు. 10 వేల మందికిపైగా నివసిస్తున్న కాలనీలో ఒక్క ఓవర్‌ హెడ్‌ ట్యాంకు కూడా నిర్మించలేదని.. ఇలాంటి పాలకులు ఎందుకని నిలదీశారు. అందుకే ఎన్నికలు బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన నాగరాజు, హిదయతుల్లా, వెంకటరమణ, లెనిన్‌, కృష్ణారెడ్డి, బాల సుబ్రహ్మణ్యం, మునిస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని