logo

వైకాపా చట్టంతో రైతులు భూములు కోల్పోతారు: వీరభద్ర గౌడ్

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని చట్టాన్ని వైకాపా ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనివల్ల రైతులు తమ భూములు కోల్పోతారని ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు.

Updated : 06 May 2024 16:15 IST

చిప్పగిరి: దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని చట్టాన్ని వైకాపా ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనివల్ల రైతులు తమ భూములు కోల్పోతారని ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు. సోమవారం చిప్పగిరి మండలంలోని దౌల్తాపురం, నంచర్ల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా అమాయకులైన రైతులు తమ భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు భూములను లాక్కునేందుకు ఈ చట్టం అణువుగా ఉందన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మీనాక్షి నాయుడు, మల్లికార్జున్ గౌడ్, సంగమేశ్వర్ గౌడ్, శివలింగ, తిమ్మయ్య, దౌల్తాపురం రామాంజనేయులు, ఎల్లార్తి మల్లికార్జున, మండల కన్వీనర్ షేక్షావలి, మండల మాజీ ఉపాధ్యక్షుడు వెంకటేష్, కుందన్ గుర్తి సర్పంచ్ పురుషోత్తం, మాజీ సర్పంచ్ భీమ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని