logo

ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంతో వైకాపా మోసం

వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టం అమలులోకి తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తోందని ఎమ్మిగనూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

Updated : 10 May 2024 14:05 IST

గోనెగండ్ల: వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టం అమలులోకి తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తోందని ఎమ్మిగనూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గోనెగండ్ల మండలంలోని పెద్దమరివీడు, చిన్నమరివీడు, గోనెగండ్ల గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆర్డీఎస్ కుడికాలువ పనులు చేపట్టి రైతులకు సాగునీటి కొరత తీరుస్తామని నియోజకవర్గ రైతులకు భరోసా ఇచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, పంచలింగాల నాగరాజును గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నఅబ్దుల్, ప్రభుదాస్, అబ్దుల్, రాంభూపాల్ నాయుడు, శీను, నాగులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని