logo

నేడు సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి తేరు

నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర, బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 18న సాయంత్రం 4 గంటలకు తేరు నిర్వహణకు ఏర్పాట్లు

Published : 18 Jan 2022 01:47 IST

సింహవాహనంపై స్వామివారి ఊరేగింపు

కొల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర, బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 18న సాయంత్రం 4 గంటలకు తేరు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం దీక్షాహవనం, లక్ష్మీగణపతి, హోమ తర్పణం, సతీసమేత ఆదిత్య నవగ్రహ, ఆంజనేయవాస్తు, రాత్రి సింహవాహన సేవ కార్యక్రమం కొనసాగాయి. ఆలయ ధర్మకర్త రాజాసురభి ఆధిత్య లక్ష్మారావు ప్రత్యేక  పూజలు నిర్వహించారు. మంగళవారం జరిగే తేరుకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రామశర్మ తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది ఆలయ ఆవరణ, రోడ్లను శుభ్రం చేశారు. జాతరకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్సై బాలవెంకటరమణ చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు తప్పని సరిగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి రావాలన్నారు.  

ఉత్సవవిగ్రహాలకు పూజలు చేస్తున్న రాజా ఆదిత్యలక్ష్మారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని