logo

అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి

దేశంలో అభివృద్ధిలో తెలంగాణ పరుగులు పెడుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జడ్పీ మైదానం

Published : 12 Aug 2022 03:16 IST

ఫ్రీడం రన్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌


ఫ్రీడమ్‌ రన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్‌రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ తదితరులు

మహబూబ్‌నగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే : దేశంలో అభివృద్ధిలో తెలంగాణ పరుగులు పెడుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జడ్పీ మైదానం నుంచి బీఈడీ కళాశాల మైదానం వరకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, క్రీడాకారులు, యవతీ యువకులు, పోలీసు సిబ్బందితో నిర్వహించిన ‘ఫ్రీడం రన్‌’ను మంత్రి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్‌ నంద్లాల్‌ పవర్‌, సీతారామారావు, అదనపు ఎస్పీ రాములు తదితరులతో కలిసి జాతీయ జెండా పట్టుకొని ముందు పరిగెత్తారు. ఉత్సాహంగా సాగిన పరుగు నేతాజీ కూడలి, న్యూటన్‌, జనరల్‌ ఆస్పత్రి, మెట్టుగడ్డ మీదుగా బీఈడీ కళాశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఫలాలు ఎందరో మహనీయుల త్యాగఫలమని గుర్తుచేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. కామన్‌వెల్త్‌ క్రీడా పోటీల్లో దేశం సాధించిన పతకాల పరంగా చూస్తే తెలంగాణ క్రీడాకారులు రెండో స్థానంలో నిలవటం క్రీడల మంత్రిగా గర్వంగా ఉందన్నారు. సమాజంలో అసమానతలు, కులమత భేదాలు పూర్తిగా తొలగిపోయి మనుషులంతా ఒకటేనన్న భావన రావాలని, అప్పుడే జాతి సమైక్యత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పుర ఛైర్మన్‌ కేసీ నర్సింహులు, ముడా ఛైర్మన్‌ గంజి వెంకన్న, పుర వైస్‌ ఛైర్మన్‌ గణేశ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని