logo

కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు

జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గద్వాల పట్టణంలోని జడ్పీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత,  మున్సిపల్ కౌన్సిలర్లతో వచ్చి ఓటు వేశారు. 

Updated : 28 Mar 2024 13:08 IST

రాజోలి : జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గద్వాల పట్టణంలోని జడ్పీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత,  మున్సిపల్ కౌన్సిలర్లతో వచ్చి ఓటు వేశారు.  ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆయా గ్రామాల ఎంపీటీసీలతో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఇక్కడ మొత్తం పురుషులు 91 మంది,  మహిళలు 134 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం: జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత

స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జడ్పీ ఛైర్‌ పర్సన్‌ సరిత అన్నారు. గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గెలుపు తప్పకుండా సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ కేశవ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని