logo

చికిత్స పొందుతూ ఒకరి మృతి.. బంధువుల ఆందోళన

గుండెనొప్పితో మియాపూర్‌ మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ మృతుడి బంధువులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. వివరాల్లోకి

Published : 21 May 2022 01:26 IST

మియాపూర్‌, న్యూస్‌టుడే: గుండెనొప్పితో మియాపూర్‌ మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ మృతుడి బంధువులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం ఇబ్రహీంబాద్‌ గ్రామానికి చెందిన వెంకటేష్‌(35)కు ఈ నెల 11న ఛాతీలో నొప్పిరావడంతో కుటుంబీకులు మదీనగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. గురువారం రాత్రి శస్త్రచికిత్స జరిగే సమయంలో.. తీవ్ర అస్వస్థతకు గురై వెంకటేష్‌ మృతిచెందాడు. ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మియాపూర్‌ సీఐ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని బంధువులతో చర్చించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలించి తడు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, తమ వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి నిర్వాహకులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని