logo

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌. ఆశాలత పేర్కొన్నారు. వజ్రోత్సవాల నేపథ్యంలో గురువారం స్థానిక ఓ పంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో

Published : 12 Aug 2022 01:08 IST

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, చిత్రంలో అధికారులు

సంగారెడ్డి అర్బన్‌,  న్యూస్‌టుడే: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌. ఆశాలత పేర్కొన్నారు. వజ్రోత్సవాల నేపథ్యంలో గురువారం స్థానిక ఓ పంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా గ్రాండ్‌ ఫినాలే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చరవాణులకు  ఆన్‌లైన్‌, సైబర్‌ నేరస్థుల వేధింపులు అధికమవుతున్నాయని వివరించారు. పిల్లలను సైబర్‌ నేరాలపై చైతన్యం చేసేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించిందని వెల్లడించారు. అదనపు కలెక్టర్‌ రాజర్షిషా మాట్లాడుతూ.. పోలీస్‌, విద్యాశాఖ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. అదనపు ఎస్పీ మధుకర్‌ స్వామి  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు స్నేహ పూర్వక పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని ప్రకటించారు. అంతకుముందు సైబర్‌ నేరాలతో మోసపోయిన బాధితులు.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు వంటి అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చూపించారు. సమావేశంలో డీఎస్పీలు రవీంద్రారెడ్డి, వి.రఘు, బాలాజీ, సీఐలు శివలింగం, రమేశ్‌, వినాయకరెడ్డి, హేమరాణి, రాంరెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని