logo

మనస్తాపంతో యువకుడి బలవన్మరణం

మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలం అక్కన్నపేటలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు.. అక్కన్నపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ (22) సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు

Published : 13 Aug 2022 01:38 IST

రామాయంపేట, న్యూస్‌టుడే: మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలం అక్కన్నపేటలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు.. అక్కన్నపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ (22) సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి మృతి చెందగా, తల్లి నాగమణితో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటంబ సభ్యులు గమనించడంతో విషయం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

పొలంలో పడి యువరైతు మృతి
రామాయంపేట, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు ఓ యువకుడు పొలంలో పడి ఊపిరాడక మృతి చెందిన ఘటన రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక      ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన కట్ట నర్సింలు (23) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి నాగమణితో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఉబ్బసంతో బాధపడుతున్నాడు. నర్సింలు గురువారం  పొలానికి వెళ్లగా.. తల్లి కూలీ పనులకు వెళ్లింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగిరాగా.. కుమారుడు కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతికింది. ఫలితం దక్కలేదు. శుక్రవారం ఉదయం  పొలానికి వెళ్లి చూడగా నర్సింలు పొలంలో విగత జీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని