logo

గోదావరి జలాల తాకిడికి కూలిన వంతెన

కూడవెల్లి వాగులోని గోదావరి నీటి ఉద్ధృతికి అక్బర్‌పేట- భూంపల్లి మండల కేంద్రం శివారులో దశాబ్దాల క్రితం నిర్మించిన లోతట్టు వంతెన ఒక్కసారిగా సోమవారం కుప్పకూలింది.

Published : 07 Feb 2023 04:14 IST

తాగునీటికి ఇబ్బందులు

న్యూస్‌టుడే - మిరుదొడ్డి, దుబ్బాక: కూడవెల్లి వాగులోని గోదావరి నీటి ఉద్ధృతికి అక్బర్‌పేట- భూంపల్లి మండల కేంద్రం శివారులో దశాబ్దాల క్రితం నిర్మించిన లోతట్టు వంతెన ఒక్కసారిగా సోమవారం కుప్పకూలింది. వంతెన కూలిపోయిన సమయంలో వాహనదారుల రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కొండపోచమ్మ సాగర్‌ కాలువ ద్వారా గోదావరి జలాలను కొడకండ్ల వద్ద ఇటీవల ఎంపీ విడుదల చేశారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా వంతెనపై నుంచి అక్బర్‌పేట, భూంపల్లి, బేగంపేట, ఖాజీపూర్‌, కూడవెల్లి, పోతారెడ్డిపేట, నగరం, తాళ్లపల్లి, చిన్ననిజాంపేట, రామేశ్వరంపల్లి గ్రామాల ప్రజలకు నీటి సరఫరా చేసేందుకు పైపులైను నిర్మాణం ధ్వంసమైంది. శుద్ధమైన తాగునీరు గంటల పాటు వృథా అయ్యాయి. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరగా ఆయా గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. ప్రజలు నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరమ్మతు చేయడానికి సమయం పడుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు ప్రజాప్రతినిధుల సహకారంతో ట్యాంకర్ల సాయంతో సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని