logo

ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం

కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బలవర్మణానికి పాల్పడిన ఘటన గజ్వేల్‌ మండలం కొల్గూరులో బుధవారం జరిగింది.

Updated : 30 Mar 2023 04:23 IST

గజ్వేల్‌: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి బలవర్మణానికి పాల్పడిన ఘటన గజ్వేల్‌ మండలం కొల్గూరులో బుధవారం జరిగింది. సీఐ వీరప్రసాద్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన సొల్లు నర్సింలు(45) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తరుచూ ఇంట్లో గొడవలు జరగటం, ఆర్థిక ఇబ్బందులు తోడవటంతో జీవితంపై విరక్తి చెంది పొలం వద్ద పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు ఆతన్ని చికిత్స నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు

మతిస్థిమితం కోల్పోయిన మహిళ...

సిద్దిపేట టౌన్‌: మతి స్థిమితం కోల్పోయిన ఓ మహిళ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్‌ ఎస్సై మల్లేశం తెలిపిన వివరాలు.... పట్టణంలోని నాసర్‌పురా వీధికి చెందిన రచ్చ శోభ అనే మహిళ గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి వ్యవహరించేది. 30 సంవత్సరాల కింద భర్త ఆమెను వదిలిపెట్టాడు. కుమారుడు రాజుతో కలసి శోభ జీవిస్తోంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేక, కుమారునికి వివాహం జరగకపోవడంతో మానసికంగా కుంగిపోయి మతిస్థిమితం కోల్పోయింది. బుధవారం ఉదయం బయటకు వెళ్లిన శోభ స్థానిక ఎర్రచెరువులో శవమై తేలింది. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని మృతురాలి కుమారుడు రాజుకు తెలపగా అతని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని