logo

కాంగ్రెస్‌పై కేంద్రం కక్షసాధింపు

కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు.

Published : 01 Apr 2023 01:41 IST

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌

మాట్లాడుతున్న అంజన్‌కుమార్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే అదానీ, అంబానీ ఇద్దరేనన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అనర్హత వేటును నిరసిస్తూ సిద్దిపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా ప్రభుత్వం దేశాన్ని పదేళ్లలో నాశనం చేసి, కేవలం ఈడీ, సీబీఐలను మాత్రమే అభివృద్ధి చేసిందన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనను చూసి ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై కవులు, కళాకారులు, మేధావులు ఎందుకు స్పందించడం లేదన్నారు. నాయకులు గంప మహేందర్‌, దరిపల్లి చంద్రం, సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా యువజన అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్‌, ఓబీసీ సెల్‌ ఛైర్మన్‌ డా.సూర్యవర్మ, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, నాయకులు సతీష్‌గౌడ్‌, నాగరాజు, ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని