దివ్యాంగులకు మరింత ఆసరా
దివ్యాంగుల్లో మరింత భరోసా నింపుతూ ప్రభుత్వం శుభవార్తను అందించింది. వారి పింఛను మరో రూ.వేయి పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించారు.
మెదక్, న్యూస్‌టుడే: దివ్యాంగుల్లో మరింత భరోసా నింపుతూ ప్రభుత్వం శుభవార్తను అందించింది. వారి పింఛను మరో రూ.వేయి పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించారు. దీంతో ఎంతోమందికి మేలు చేకూరనుంది. ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు నెలకు ప్రస్తుతం రూ.3,016, ఇతర విభాగాల వారికి రూ.2,016 పింఛన్ అందజేస్తోంది. గత ఆగస్టులో పింఛన్ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించడంతో మరింత మంది లబ్ధిదారులకు సాయం అందుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న సాయాన్ని మరింత పెంచింది. వచ్చే నెల నుంచి రూ.4,116 చెల్లిస్తామని స్పష్టం చేయడంతో దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబురాల్లో తీపి కబురు అందించినట్లయింది. తాజా నిర్ణయంతో జిల్లాలోని 8,615 మంది లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని దివ్యాంగులు మొత్తంగా రూ.2.59 కోట్లకు పైగా లబ్ధి పొందుతున్నారు. పెరగనున్న సొమ్ముతో ఆ మొత్తం రూ.3.54 కోట్లకు చేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ
-
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు