logo

ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్‌ ధనుంజయ్‌ రిమాండ్‌

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్‌ ఆడిటర్‌ ధనుంజయ్‌ని రిమాండ్‌కు తరలించామని చేర్యాల సీఐ ఎల్‌.శ్రీనివాస్‌ గురువారం రాత్రి తెలిపారు.

Published : 29 Mar 2024 02:39 IST

చేర్యాల, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్‌ ఆడిటర్‌ ధనుంజయ్‌ని రిమాండ్‌కు తరలించామని చేర్యాల సీఐ ఎల్‌.శ్రీనివాస్‌ గురువారం రాత్రి తెలిపారు. 2020-21 నుంచి 2022-23 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల మల్లన్న ఆలయానికి సంబంధించిన ఐటీ, జీఎస్టీ రిటర్న్స్‌ కోసం ఆలయ అధికారులు హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సదరు ఆడిటర్‌తో ఒప్పందం కుదుర్చుకొని రూ.17.50 లక్షలు ఇచ్చారు. అయితే ధనుంజయ్‌ కేవలం రూ.3.30 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారు. మిగిలిన డబ్బులు లెక్క చూపకుండా, నెలలు గడిచినా సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆలయ ఈవో బాలాజీ గతేడాది నవంబరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తప్పించుకుని తిరుగుతున్న ఆడిటర్‌ను ఎట్టకేలకు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని