logo

సీనియర్‌ సివిల్‌ జడ్జికి పీహెచ్‌డీ ప్రదానం

తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్‌కు గురువారం పీహెచ్‌డీ ప్రదానం చేశారు.

Updated : 29 Mar 2024 04:58 IST

సంగారెడ్డి సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధాకృష్ణ చవాన్‌ను అభినందిస్తున్న రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి

తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్‌కు గురువారం పీహెచ్‌డీ ప్రదానం చేశారు. డా.శివకుమార్‌ పర్యవేక్షణలో ‘న్యాయ నిర్వహణలో సాంకేతికతకు సంబంధించిన చట్టాలు’ అనే అంశంపై పరిశోధన చేసిన రాధాకృష్ణ గురువారం ఏర్పాటుచేసిన వైవాలో తన సిద్ధాంత గ్రంథం సమర్పించారు. న్యాయస్థానంలో త్వరిత గతిన కేసులు పరిష్కరించే ప్రయత్నంలో సాంకేతికతను జోడించినప్పుడు ఎదురయ్యే సమస్యలకు చట్టాలు ఎలా ఉపయోగపడతాయి, నూతన సాంకేతిక ఉపయోగాలు, ఇతర అంశాలను ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రాధాకృష్ణ చవాన్‌ను రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి అభినందించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రసన్నరాణి, డీన్‌ శ్రీనివాస్‌, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని