logo

పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్‌ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

Published : 07 May 2024 03:50 IST

బూర్గుపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, అభ్యర్థి నీలం మధు, తదితరులు

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్‌ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. బూర్గుపల్లిలో నీలం మధు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్‌ అని పేర్కొన్నారు. భారాస, భాజపాలు పదేళ్లుగా పేదలకు ఇళ్లు ఇవ్వలేదని అన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని భారాస ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత 5 గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ... పదేళ్లలో మన జీవితాలు ఆగమయ్యాయని, గెలిచిన మూడు నెలల్లో మెదక్‌లో కూడళ్లను అభివృద్ధి చేశామని, బూర్గుపల్లి ఉన్నత పాఠశాలకు రూ.57 లక్షలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఎక్కడికి వెళ్లినా భారాస కనుమరుగైందని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్లలో భారాస పార్టీ దుకాణం బంద్‌ అయ్యిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మ్యాడం బాలకృష్ణ, మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి సురేష్‌, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు మంజులు, మండలాధ్యక్షులు శ్రీనివాస్‌ నాయకులు పరశురాం, ఎంపీటీసీ అర్చన, నాయకులు పరశురాంగౌడ్‌, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌  ఉన్నారు.

రామాయంపేట: భారాస భూములు లాక్కుంటే 50 ఏళ్ల క్రితమే కాంగ్రెస్‌ పార్టీ సీలింగ్‌ భూములకు పేదలకు పంచిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. రామాయంపేటలో నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. మెదక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని