logo

‘కాంగ్రెస్‌ హయాంలోనే రైతుల సంక్షేమం’

రైతుల హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దూపహాడ్‌లో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు.

Published : 22 May 2022 03:59 IST

 

దూపహాడ్‌లో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి

పెన్‌పహాడ్‌, న్యూస్‌టుడే : రైతుల హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దూపహాడ్‌లో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. ఆర్థికంగా నష్టపోయిన కర్షకులకు భరోసా కల్పించేందుకే కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టిందన్నారు. పార్టీ శ్రేణులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలన్నారు. భాజపా, తెరాస ప్రభుత్వాలు రైతుల సమస్యలను విస్మరిస్తూ బూటకపు విమర్శలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఆర్థికంగా, సామాజికంగా అన్నదాతలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే అన్నదాతలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధుడు రౌతు రాజేశ్వర్‌రావు చిత్రపటానికి నివాళి అర్పించారు.
రాజీవ్‌గాంధీకి నివాళి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దూపహాడ్‌లో నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ తూముల భుజంగరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు కోటేశ్వరరావు, పుష్పావతి, వేణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు పాల్గొన్నారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని