logo

జీవించే హక్కు హరించడం సరికాదు

జీవనోపాధి లేకుండా చేసి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును హరించడం సరికాదని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం

Published : 26 May 2022 02:23 IST

తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం

యాదగిరిగుట్ట: దీక్షలో కూర్చున్న తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్‌

కోదండరాంకు వినతిపత్రం అందజేస్తున్న ఆటో కార్మికులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: జీవనోపాధి లేకుండా చేసి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును హరించడం సరికాదని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు చేపడుతున్న రిలే నిరసన దీక్షలను బుధవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధి కోసం భూములు లాక్కున్నారు.. దుకాణాలు లాక్కున్నారు.. ఇపుడు ఆటో కార్మికులను కొండపైకి రానివ్వకుండా ఉపాధి దెబ్బకొట్టారు.. జీవనోపాధి లేకుండా మనిషిగా జీవించడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బతుకుంటుంది, బతుకు దెరువు ఉంటుందని అనుకుంటే సాక్షాత్తు యాదాద్రీశుడి సన్నిధి వద్దే ఆటో కార్మికులకు ఈ గతి పట్టడం బాధాకరమన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకాలంలో చేసిన వాగ్దానాలను ఒకసారి స్మరించుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. అంతకుముందు ఆటో కార్మికులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సాంస్కృతికి విభాగం సమన్వయకర్త చిప్పలపల్లి మధు, జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్‌, యువజన అధ్యక్షుడు మందల బాలకృష్ణ, మండల అధ్యక్షురాలు కొంగరి అనిత, నాయకులు వెంకటేశ్‌, శ్రీనివాస్‌, మధు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట పట్టణం: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని బుధవారం ప్రొఫెసర్‌ కోదండరాం, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి పూజారులు స్వామి వారి ఆశీస్సులు, ఏఈవో రమేశ్‌బాబు ప్రసాదం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని