logo

పేదరికానికి పక్షవాతం తోడై.. బతుకు భారమై

వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భర్త చెప్పులు కుడుతూ, భార్య కూలీ పనులకు వెళ్తూ వచ్చిన సంపాదనతో జీవించేవారు.

Published : 28 Jun 2022 04:55 IST


నర్సయ్యను మంచంలో కూర్చోబెడుతున్న భార్య

కోదాడ న్యూస్‌టుడే: వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. భర్త చెప్పులు కుడుతూ, భార్య కూలీ పనులకు వెళ్తూ వచ్చిన సంపాదనతో జీవించేవారు. అలాగే వారి రెక్కల కష్టంతో తిని తినక కొంత కూడబెట్టి ముగ్గురు కూతుర్లకు పెళ్లిళ్లు చేసేశారు. ఇక బాధ్యతలు తీరాయని ఉన్నంతలో ఆనందంగా గడుపుదామకున్న సమయంలో విధి వక్రీకరించింది. కుటుంబ పెద్ద పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితమయ్యాడు. భర్త బాగోగులు చూసుకునేందుకు భార్య ఇంటికే పరిమితమైంది. దీంతో వారికి సంపాదన లేక పోషణ భారమైంది. ప్రతి నెల వచ్చే రేషన్‌ బియ్యాన్ని తింటూ కాలం వెల్లదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కోదాడ పట్టణపరిధిలోని కొమరబండకు చెందిన పంగ నర్సయ్య దీనగాథ ఇది. రెండేళ్ల కిందట నర్సయ్యకు పక్షవాతం వచ్చింది. మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో కాళ్లు, చేతులు చచ్చుబడి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కనీసం తినాలన్న మరొకరి సాయం ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో భార్య ఇంటి కూడా ఇంటికే పరమితమైంది. చేతుల్లో చిల్లి గవ్వ లేక పూట గడవటం కష్టమైంది. ఆసరా పింఛన్‌ మంజూరు చేయాలని అధికారల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వర్షం వస్తే ఇళ్లు కురుస్తోందని, నర్సయ్యకు ప్రభుతం స్పందించి మెరుగైన వైద్యం సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని