logo

ప్రతిభ చాటి.. ప్రవేశం పొంది..

బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారుచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. చదువుతో పాటు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చటమే ఈ

Published : 01 Jul 2022 05:37 IST

సూర్యాపేట: జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు (పాతచిత్రం)

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: బాల్యం నుంచే చిన్నారులను క్రీడల్లో మెరికలుగా తయారుచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. చదువుతో పాటు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చటమే ఈ పాఠశాలల ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 4, 5 తరగతుల విద్యార్థులకు పోటీలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీట్లకు తగ్గ బాలబాలికలను ఎంపిక చేస్తుంటారు. సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు, ఐదో తరగతి విద్యార్థులు 13 మంది హకీంపేట (హైదరాబాద్‌), కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోని క్రీడా పాఠశాలల్లో ఇటీవల చోటు దక్కించుకున్నారు. వీరిలో పలువురు ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు.  

త్వరలో ఎంపిక పోటీలు: వెంకట్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ... హకీంపేటలో జరిగిన పోటీల్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులు సీటు సాధించారు. త్వరలో మళ్లీ ప్రభుత్వ ఆదేశానుసారం నాలుగో తరగతి విద్యార్థులకు హకీంపేట క్రీడా పాఠశాలల ఎంపిక పోటీలు నిర్వహిస్తాం. ఇప్పటి నుంచే బాలబాలికలను తీర్చిదిద్దాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించాం.


క్రీడా కోటాలో ఉద్యోగం సాధిస్తా:
మామిడి నాగపునీత్‌, ఐదోతరగతి, హుజూర్‌నగర్‌

క్రీడా పాఠశాలలకు ఎంపికవటం ఆనందంగా ఉంది. నిపుణుల పర్యవేక్షణలో నిత్యం సాధన చేస్తూ మెలకువలు నేర్చుకుంటాను. తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటాను. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించటమే ధ్యేయంగా ముందుకు సాగుతాను. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించటమే లక్ష్యం.


జాతీయ స్థాయిలో రాణించటమే ధ్యేయం
బొల్లేపల్లి భార్గవ్‌, ఐదోతరగతి, సూర్యాపేట

క్రీడా పాఠశాలకు ఎంపికవడం సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఆటల్లో ఆరితేరేందుకు క్రీడా పాఠశాలను వినియోగించుకుంటాను. జాతీయ స్థాయి పోటీల్లో రాణించటమే ధ్యేయంగా ముందుకు సాగుతాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని