logo

ఆకాశమే హద్దుగా..

నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం కోదండాపురం మెట్రోవాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు నుంచి జంటనగరాలకు నీటిని సరఫరా చేసే మొదటి ఫేజ్‌ పైపులైన్‌ ఎయిర్‌వాల్వ్‌ నుంచి మంగళవారం ఉదయం కృష్ణమ్మ ఎగిసిపడింది.

Published : 17 Aug 2022 04:39 IST

నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం కోదండాపురం మెట్రోవాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు నుంచి జంటనగరాలకు నీటిని సరఫరా చేసే మొదటి ఫేజ్‌ పైపులైన్‌ ఎయిర్‌వాల్వ్‌ నుంచి మంగళవారం ఉదయం కృష్ణమ్మ ఎగిసిపడింది. ప్లాంటులో మరమ్మతులు, పైపులైన్‌పై ఎయిర్‌ వాల్వ్‌ల మార్పిడికి నీటిని తొలగించే ప్రక్రియలో భాగంగా పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద ఏఎమ్మార్పీ కాల్వపై ఎయిర్‌వాల్వ్‌ తొలగించడంతో ఇలా పెద్దఎత్తున నీరు విడుదలయింది. ఈ దృశ్యం రెండు గంటలు కొనసాగగా.. కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారిపై ప్రయాణికులు, నాగార్జునసాగర్‌ పర్యాటకులు ఇక్కడ సరదాగా గడిపారు. ప్లాంటులో మరమ్మతుల దృష్ట్యా ముందస్తుగా ప్రకటించినట్లుగా 24 గంటలపాటు ప్లాంట్‌ను మూసేసి మరమ్మతులు చేపట్టామని మెట్రోవాటర్‌ బోర్డు సీజీఎమ్‌  దశరథరెడ్డి ‘న్యూస్‌టుడే’తో తెలిపారు.  - పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని